గుంటూరు జిల్లా మంగళగిరిని పర్యటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి కొండ చుట్టూ గిరి ప్రదర్శన కోసం ప్రత్యేక రహదారి నిర్మించనున్నారు. ఈ పనులను ఆయన పరిశీలించారు. ఈ రహదారి కోసం అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు. రహదారితో పాటు ఉదయం నడక కోసం మరో మార్గాన్ని నిర్మించే అవకాశముందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఈ నిర్మాణ పనులను చేపడతామని స్పష్టం చేశారు.
మంగళగిరిని పర్యటకంగా మరింత అభివృద్ధి చేస్తాం - మంగళగిరిని అభివృద్ది చేస్తాం
గుంటూరు జిల్లా మంగళగిరిని పర్యటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి కొండ చుట్టూ గిరి ప్రదర్శన కోసం ప్రత్యేక రహదారి నిర్మించనున్నట్లు వివరించారు.
మంగళగిరిని పర్యటకంగా మరింత అభివృద్ధి చేస్తాం