గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో... రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ తుమ్మల నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అతనిపై కొంత మంది వైద్య విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రివేళల్లో అసభ్యకరంగా మాట్లాడటం, తాను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేకపోతే పరీక్షలలో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులను వేధించిన తుమ్మల నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించారు.
మెడికోలను వేధిస్తున్న సైకో డాక్టర్‌కు సంకెళ్లు..! - డాక్టర్ తుమ్మల నాగేశ్వరరావు వార్తలు
'నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి మీరు రావాలి. లేదంటే పరీక్షల్లో మీరు ఎలా పాస్ అవుతారో నేను చూస్తా' ఇది వైద్య విద్యార్థినుల పట్ల ఓ వైద్యుడి ప్రవర్తన. పాఠాలు నేర్చుకోవడానికి తన వద్దకు వచ్చిన మెడికోలను ఇలా బెదిరించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
mangalagiri rural Police have arrested a doctor who sexually abused Medicos