ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కలకలం.. బోసిపోయిన మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ - మంగళగిరి పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులు

కరోనాతో గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ బోసిపోయింది. ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మొత్తం 29మంది సిబ్బందికిగాను కేవలం ఇద్దరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు.

mangalagiri police station emptied with corona cases
కరోనా కలకలం.. బోసిపోయిన మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్

By

Published : Jul 20, 2020, 2:41 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. మొత్తం 29మంది సిబ్బందికిగాను కేవలం ఇద్దరే విధుల్లో ఉంటున్నారు. ఆరుగురు కరోనా చికిత్స తీసుకుంటుండగా మరి కొంత మంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

కేవలం ఇద్దరు, ముగ్గురు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం స్టేషన్ సోడియం హైపో ద్రావణంతో శుద్ధి చేస్తున్నారు. తామూ భయంతోనే విధులు నిర్వహిస్తున్నామని డ్యూటీలో ఉన్న సిబ్బంది తెలిపారు. ఎప్పుడూ జనంతో కిటకిట లాడే గ్రామీణ పోలీస్ స్టేషన్ కరోనా కేసులతో బోసిపోయింది.

ABOUT THE AUTHOR

...view details