గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరదాగా గడిపారు. లాక్డౌన్ నిబంధన అమల్లో ఉండటంతో తన వ్యవసాయ క్షేత్రంలో గేదెలు, మేకలను మేపారు. వాటి కోసం స్వయంగా చెట్లు ఎక్కి కొమ్మలు కొట్టి మేత అందించారు. లాక్డౌన్ ముగిసేవరకూ ఇక్కడే గడుపుతానని ఆయన తెలిపారు. పూర్తి సమయాన్ని మొక్కల పెంపకం, జంతువుల సంరక్షణకు కేటాయిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.
మూగజీవులను మేపుతూ.. కాలక్షేపం చేస్తున్న ఎమ్మెల్యే - మంగళగిరిలో లాక్డౌన్ ప్రభావం
రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధన కఠినంగా కొనసాగుతోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు.. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... తన వ్యవసాయ పొలంలో మూగజీవాలను మేపుతూ కాలక్షేపం చేశారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండి.. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
గేదెలు మేపుతూ కాలక్షేపం చేస్తున్న ఎమ్మెల్యే