అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామానికి చెందిన అగిశాల మహేష్‌కు.. తేజస్విని అనే యువతితో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె ఉంది. ఇటీవల ఆ చిన్నారికి సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించారు.
SUICIDE : భార్య తిట్టిందని.. మద్యంలో విషం కలుపుకుని తాగాడు
మద్యం విషయంలో భార్య మందలించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యంలో విషపు గుళికలు కలుపుకొని తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే.. ఈ వేడుకలో మహేష్ మద్యం తాగాడు. ఈ విషయమై భార్య తేజస్విని, మహేష్ మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో.. మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం తాను పనిచేసే కంపెనీలో ఉపయోగించే.. అల్యూమినియం పాస్పైడ్ గుళికలను మద్యంలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి :
love life app cyber crime : సరికొత్త సైబర్ మోసం.. అమాయకులే లక్ష్యం