గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన విద్యుత్తు కార్మికుడు ఆరీఫ్ బాష విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. 24వ వార్డులోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చాణిక్య తెలిపారు.