నూతన ఇసుక విధానంపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎంకు పేపర్లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు ఎందుకు దొరకటం లేదని ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని జగన్ భారీగా ప్రకటనలు ఇస్తున్నారని ట్విట్టర్లో మండిపడ్డారు.ప్రభుత్వం చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ నిజంగా పనిచేస్తే... ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నూతన ఇసుక పాలసీతో 50 మంది కార్మికులు బలయ్యారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇసుక రేటుని వైకాపా నాయకులు పెంచుకుంటూ పోతున్నారన్నారు. పత్రిక ప్రకటనలకు కోసం వృథా అవుతున్న ప్రజాధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తామని లోకేశ్ హితవు పలికారు.
'పత్రిక ప్రకటనల ఖర్చుతో... భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవచ్చు' - తాజా ఇసుక వార్తలు
ప్రభుత్వం పత్రిక ప్రకటనల కోసం వృథా చేసే ప్రజాధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.
లోకేశ్