ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురజాలలో వివిధ పార్టీ నాయకుల ముందస్తు నిర్బంధాలు

గుంటూరు జిల్లా గురజాలను జిల్లా కేంద్రం చేయాలంటూ ధర్నాకు సిద్ధమైన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

leaders house arrest
గురజాలలో వివిధ పార్టీ నాయకుల ముందస్తు నిర్బంధాలు

By

Published : Nov 13, 2020, 1:05 PM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పోలీసులు ముందస్తుగా వివిధ పార్టీ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు ప్రాంతంలోని గురజాలను జిల్లా కేంద్రం చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందుగా గృహనిర్బంధం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details