కొండవీటి కోట... 50 కొండల సమాహారమైన శతృ దుర్భేద్యంగా నిర్మితమైంది. అలనాటి చారిత్రక సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. కొండపై నుంచి కొండవీడు కోటను చూస్తే..ఆనాటి చారిత్రక వైభవం మన కళ్లముందు కదలాడుతుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న కొండవీటి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప.. కోటపై విహంగ వీక్షణం చేశారు. వారితో ఈటీవీ భారత్ ముఖాముఖి.