రైతులు తాము పండించిన పంటకు ధర నిర్ణయించుకోలేేని పరిస్థితులో ఉండటం దురదృష్టకరమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా లాంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆధునిక వంగడాలతో పండించిన పంటలు, వ్యవసాయ పనిముట్లు, సాంకేతిక పరికరాలు, వాహనాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతులకు వ్యవసాయంలో కొత్త విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కిసాన్ మేళా ప్రతి ఏటా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.
వ్యవసాయంలో నూతన పద్దతులపై అవగాహనకు కిసాన్ మేళా
గుంటూరు జిల్లా లాంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. ఇలాంటి ప్రదర్శన తప్పనిసరిగా రైతులకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
గుంటూరు జిల్లాలో కిసాన్ మేళా
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని... రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నామని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోతే ఆదుకునేందుకు ప్రత్యేక నిధి కేటాయించిందని వివరించారు.