ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడి వద్ద నుంచి రూ 13 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలానికి చెందిన కృష్ణ గుంటూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నెల 3వ తేదీన ఓ నెంబర్ నుంచి అతడికి కాల్ వచ్చింది. ఓ మహిళ అలియన్స్ ఫార్మా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఉందని చెప్పగానే.. కృష్ణ వెంటనే ఒప్పుకున్నాడు. వారి మధ్య ఉన్న ఒప్పందం మేరకు ఉమేష్ బాబు అనే పేరుతో ఉన్న అకౌంట్‌కు రూ.5 వేలు పంపించాడు. అలా విడతలవారీగా వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలకు పైగా జమ చేశాడు.
CHEATING: ఉద్యోగమిస్తామని ఫోన్..ఆ తర్వాత ఏం చేశారంటే..! - guntur crime news
ఫార్మా కంపెనీలో ఉద్యోగం ఉందంటూ ఫోన్ రాగానే చేయడానికి ఒప్పుకున్నాడు. విడతల వారీగా డబ్బులు కట్టాడే కానీ.. మోసాన్ని గ్రహించలేకపోయాడు. రోజులు గడుస్తున్నా అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో.. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
job cheating in guntur district
ఉద్యోగం ఇస్తానన్న వారినుంచి ఎంతకూ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.