ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు: మనోహర్‌ - జనవాణి

JANASENA PAC CHAIRMAN : ప్రజల సమస్యలపై ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన వ్యవహరాల కమిటీ ఛైర్మన్​ నాదెండ్ల దుయ్యబట్టారు. అన్ని జిల్లాలో జనవాణి సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

JANASENA PAC CHAIRMAN
JANASENA PAC CHAIRMAN

By

Published : Oct 30, 2022, 7:14 PM IST

Updated : Oct 30, 2022, 9:14 PM IST

NADENDLA MANOHAR COMMENTS : అరాచక పాలనలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జనవాణి కార్యక్రమంలో 2,750 వినతులు వచ్చాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో జనవాణి సభలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. వచ్చే నెల 12, 13, 14న జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై ఆడిట్ చేపడతామని పేర్కొన్నారు.

అంతకుముందు జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా విశాఖ ఘటనపై ప్రభుత్వ తీరును చర్చించినట్లు తెలుస్తోంది.

జనసేన వ్యవహరాల కమిటీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్‌

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2022, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details