ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్​.. ప్రాణభయంతో వైకాపా ఎమ్మెల్యేలు: పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు

Pawan Kalyan Comments: ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ బాధ్యతను డీజీపీ తీసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాణహాని ఉందని ఆనం ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అధికారం పార్టీ ఎమ్మెల్యేలే భయపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.

pawan
పవన్

By

Published : Feb 2, 2023, 6:44 PM IST

Pawan Kalyan Comments: ప్రాణహాని ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన చెందుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డికి కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని ఆరోపించారు. ఆనం రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని.. ఆ బాధ్యతను డీజీపీ తీసుకోవాలని పేర్కొన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోని పరిస్థితిలో.. రాష్ట్రంలో పరిస్థితిని హోంశాఖ లేఖ ద్వారా వివరిస్తానని స్పష్టం చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాణహానితో భయపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కులేదని పేర్కొన్నారు. ఆనం ప్రాణహాని వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు ఏం వివరణ ఇస్తుందని ప్రశ్నించారు. సీఎంపై కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై డీజీపీ, హోంమంత్రి ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details