స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే.. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీజీపీ గౌతం సవాంగ్ ప్రజలను కోరారు. ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని.. నిందితులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసే వారిపై నిఘా పెట్టామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమరాలతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటం సరికాదని రాజకీయ పార్టీలకు సూచించారు.
'ప్రజలను భయబ్రాంతులకు గురి చేయటం సరికాదు'
రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు రాజకీయ పార్టీలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటం సరికాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్