ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రచారం చేయకుండా బెదిరిస్తున్నారు.. రక్షణ కల్పించండి' - ఎన్నికల సంఘం తాజా వార్తలు

తనను ఎన్నికల ప్రచారం చేయకుండా కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని గుంటూరు 21వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి గురవయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరారు.

బెదిరింపులకు గురిచేస్తున్నారు...రక్షణ కల్పించండి
బెదిరింపులకు గురిచేస్తున్నారు...రక్షణ కల్పించండి

By

Published : Mar 7, 2021, 4:14 PM IST

బెదిరింపులకు గురిచేస్తున్నారు...రక్షణ కల్పించండి

గుంటూరు 21వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎన్నికల ప్రచారం చేయకుండా కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని గురవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న తనను కాదని..,వేరే వ్యక్తికి టికెట్ కేటాయించటంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగానన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు వ్యక్తులు తనతో పాటు అనుచరులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరారు. తనతో పాటు సానుభూతిపరులు, వార్డు ప్రజలకు ఏదైనా జరిగితే ప్రత్యర్థి పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details