ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్‌ - capital amaravati

రాజధానిగా అమరావతి కొనసాగాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిపై మంత్రి బొత్స ప్రకటనలే గందరగోళానికి తెరలేపాయని విమర్శించారు.

పవన్

By

Published : Aug 30, 2019, 6:26 PM IST

ముఖ్యమంత్రి మారితే రాజధాని మ ారుస్తారా అంటూ ప్రభుత్వాన్ని జనసేన అధినేత ప్రశ్నించారు. అమరావతిలో పర్యటిస్తున్న పవన్.. తుళ్లూరు బహిరంగసభలో రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతిపై మంత్రి బొత్స ప్రకటనలే గందరగోళానికి కారణమయ్యాయని విమర్శించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. రాజధానికి అవసరమైన డబ్బును జగన్ తన జేబులో నుంచి ఇవ్వరన్న జనసేనాని... హైదరాబాద్‌కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. రాజధానిపై చంద్రబాబు వైఖరి అపోహలకు దారితీసిందని ఆరోపించారు. తెదేపా హయాంలో రాజధానికి వేల ఎకరాల సేకరణ వల్లే అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చాయని అన్నారు. "రాజధానిగా అమరావతి ఉంటుందని నేను మాటిస్తున్నా" అంటూ ప్రజలకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

పవన్ పర్యటనకు వర్షం అడ్డంకి
తుళ్లూరు బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం... పవన్‌ కల్యాణ్ దొండపాడు,అనంతవరం,రాయపూడిలో పర్యటనకు బయలుదేరారు. ఈ సమయంలో వర్షం పడటంతోవాహనంలో నుంచే తన పర్యటనను కొనసాగించారు.కరకట్టపై వెళ్లే సమయంలో కూల్చివేసిన ప్రజావేదికను జనసేన నేతలు ఆగి చూశారు.పర్యటన పూర్తి చేసుకుని మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details