గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లేందుకు అధికారులు అధునాతన సాంకేతిక పద్ధతిని పాటించారు. కేసులు నమోదైన వీధిలో అధికారులు డ్రోన్ సహాయంతో హైపో క్లోరైడ్ ద్రావణం చల్లించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ డ్రోన్లను రూపొందించారు. పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని, గుంటూరు అర్బన్ ఏఎస్పీ ఈశ్వర్రావు ఈ పనులను పర్యవేక్షించారు.
కరోనా రెడ్జోన్లలో డ్రోన్‌తో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ - lockdown in mangalagiri
కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రెడ్‌జోన్ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో అధికారులు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో డ్రోన్‌తో హైపో క్లోరైడ్ ద్రావణ పిచికారి