లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలను నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
మద్యం విక్రయాలపై పిటిషన్... హైకోర్టులో విచారణ - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాన్ని సవాలు చేస్తూ... విశాఖకు చెందిన నరేశ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
మద్యం విక్రయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ