2014 ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారంటూ.. అప్పటి రాజ్యసభ ఎంపీ అధినేత చిరంజీవిపై గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.
చిరంజీవి
By
Published : Mar 14, 2019, 1:24 PM IST
చిరంజీవి
2014 ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఆరోపిస్తూ... అప్పటి రాజ్యసభ ఎంపీ చిరంజీవిపై గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2014 ఏప్రిల్ 27న రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం చేశారని చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. కేసుపై చిరంజీవిహైకోర్టును ఆశ్రయించారు. ప్రచారం ముగించుకొని వస్తుండగా కేసు నమోదు చేశారని చిరంజీవి తరఫు న్యాయవాది వాదించారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం కేసును కొట్టేసింది.