ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు కుటుంబానికి కలెక్టర్ సాయం... - శ్యాముల్ ఆనంద్ కుమార్

గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్‌... ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. తనవంతు సాయం అందించారు.

farmer

By

Published : Jun 29, 2019, 10:27 AM IST

రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. అయినా రైతును బతికించలేకపోతోంది. తాజాగా గుంటూరు జిల్లా వింజనంపాడులో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. దిక్కుతోచుని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ 7 లక్షల సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధైర్యంగా ఉండాలని విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, రైతులు అధైర్యపడవద్దని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details