కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై త్వరలో గుంటూరులో జరగనున్న సమీక్షా సమావేశానికి కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల రానున్నట్లు మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కాక, రాయితీలు అందక.. రైతులు నష్టపోతున్నారని కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ రాశారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని లేఖలో వివరించారు. అందుకే పథకాల అమలు తీరును సమీక్షించేందుకు గుంటూరు రావాలని కోరగా.. కేంద్రమంత్రి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం సూక్ష్మసేద్య పథకం, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేయటం లేదని.. ఉద్యాన పంటల రాయితీలను నిలిపివేసిందని లేఖలో జీవీఎల్ ఆరోపించారు.
మిరప సేద్యంలో ఆధునిక యంత్రాల ఉపయోగం అవసరం..