గుంటూరు అర్బన్‌లో 8మంది పోలీసులపై చర్యలు
గుంటూరు అర్బన్ పరిధిలో ఇద్దరు ఎస్సైలను, 8 మంది కానిస్టేబుళ్లను వి.ఆర్ కి పంపుతూ అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. నల్లపాడు ఎస్సై సుబ్బారావు, లాలాపేట ఎస్సై రవీంద్ర తో పాటు మరో 8 మంది కానిస్టేబుళ్ల పై వచ్చిన అవినీతి ఆరోపణలు పై శాఖ పరమైన విచారణ జరిపించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారి నుంచి లంచాలు డిమాండ్ చేయడంతో పాటు స్టేషన్ పరిధిలో వసూళ్లకు పాలపడుతున్నట్లు తేలడంతో అర్బన్ ఎస్పీ రామకృష్ణ చర్యలు తీసుకున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో ఇద్దరు ఎస్సై లు , 8 మంది కానిస్టేబుల్ పై ఒకే రోజున చర్యలు తీసుకొవడం.. గుంటూరు జిల్లా పోలీసులలో కలకలం రేపింది.
గుంటూరు అర్బన్‌లో 8మంది పోలీసులపై చర్యలు