కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళం సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని జడ్పీ పాఠశాలలో అధికారులు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ.. పోలీసుల్లా వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు.
గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రార్థనా మందిరాలపై రక్షక దళం దృష్టి పెట్టాలని సూచించారు. విధుల గురించి డీఎస్పీ ప్రశాంతి అవగాహన కల్పించారు. మొత్తం 135 మందిని సభ్యులుగా నియమించినట్లు సీఐ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరహరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.