గుంటూరు నగరంలో నూతనంగా నిర్మించనున్న టిడ్కో గృహాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. వైఎస్సార్ హౌసింగ్ పథకం కింద అడవి తక్కెళ్లపాడు, వెంగలాయపాలెం లేఅవుట్లలో 1,276 ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడు విధాలుగా నిర్మించబోయే ఈ గృహాలు 300, 365, 430 చదరపు అడుగుల్లో ఉంటాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు.
'టిడ్కో గృహాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తాం'
గుంటూరులో నూతనంగా నిర్మించనున్న టిడ్కో గృహాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. నగర పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు.
వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలలోపు ఉండి, గతంలో గృహ వసతి లబ్ది పొందనివారు ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితంగానే నిర్మిస్తామని తెలిపారు. మిగతా రెండు విభాగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ పోను మిగతా మొత్తానికి బ్యాంకు ద్వారా రుణం అందిస్తామన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికలాంగులు, వృద్ధులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి:సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలి: చంద్రబాబు