ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద బారులు.. భౌతిక దూరం మరుస్తున్న తీరుతో ఇబ్బందులు

లాక్‌డౌన్‌ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చింది. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.

guntur lock down
guntur lock down

By

Published : May 4, 2020, 1:39 PM IST

గుంటూరు జిల్లాలో ఉదయం దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మద్యం దుకాణాలు రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే 25 శాతం ధరలు పెంపుదల చేసిన ప్రభుత్వం.. వాటి పట్టికలను దుకాణాల వద్ద అందుబాటులోకి తీసుకువ్చింది.

పెరిగిన మద్యం ధర అప్‌డేట్‌ కాకపోవడంతో అమ్మకాలు ఆలస్యమవుతున్నాయి. ఈ కారణంగా... మద్యం దుకాణాల వద్ద గందరగోళం నెలకొంది. భారీగా వస్తున్న మందుబాబులను పోలీసులు భౌతిక దూరం పాటించేలా వరుసల్లో నిలబెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details