ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపద సమయంలో ఆకలి తీరుస్తున్న జైన యువత - పేదల ఆకలి తీర్చిన గుంటూరు యువత

కరోనా వ్యాధి నిరోధానికి రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ నడుస్తోంది. లాక్​డౌన్​తో నిత్యవసరాలు మినహా అన్ని సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రోజువారి కూలీలు, భిక్షాటనపై ఆధారపడి జీవించే వారు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చారు గుంటూరుకు చెందిన జైన యువకులు.

Guntur jain youth distribute food to poor
ఆపద సమయంలో ఆకలి తీరుస్తున్న జైన యువత

By

Published : Mar 24, 2020, 5:28 PM IST

ఆపద సమయంలో ఆకలి తీరుస్తున్న జైన యువత

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్​ నడుస్తోంది. స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని ప్రభుత్వం కోరుతుంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. లాక్​డౌన్​ కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎవరు లేని నిరుపేదలు, భిక్షాటనపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చారు గుంటూరుకు చెందిన జైన యువజన సంఘం ప్రతినిధులు. ఉదయం ఉప్మా, మధ్యాహ్నం పులిహోర, సాంబార్ రైస్​ ప్యాక్ చేసి అందిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details