మూడో దశ కరోనా ముప్పు పొంచి ఉన్న తరుణంలో.. గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కొత్తగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలను వైద్యారోగ్యశాఖ చేపట్టింది. పిడియాట్రిక్ విభాగంలో 46 పోస్టులకు గాను ముగ్గురు వైద్యులు, 54 స్టాఫ్ నర్సు ఖాళీలకు 45 మంది, ఎంఎన్ఓ, ఎఫ్ఏంఓ విభాగాల్లో 36 పోస్టులకు గాను 25 మందికి నియామక పత్రాలను అందించారు.
శుశ్రుత హాలులో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేశారు. కొవిడ్ నియంత్రణలో ప్రధానపాత్ర పోషించాలని.. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేసి ఆసుపత్రి పేరును నిలబెట్టాలని జీజీహెచ్ ఇంఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు.