పేదలకు ఉచితంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పును.. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేశారు. వీటి కోసం ప్రజలు రేషన్ దుకాణాలు వద్ద బారులు తీరారు. నరసరావుపేటలో ప్రభుత్వ రేషన్ దుకాణాలు తెరుచుకోవడంలో సమయపాలన లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళగిరి పట్టణంలో 12, 20, 25 నెంబరు రేషన్ దుకాణంలో సర్వర్ లోపంతో సరుకుల సరఫరా నిలిచింది. కొన్ని చోట్ల సరుకుల కోసం ప్రజలు బారులు తీరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రభుత్వం ఏర్పాట్లు బాగానే చేసినా.. దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడ్డట్టుగా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేషన్ కోసం పడిగాపులు... జిల్లా వ్యాప్తంగా కిక్కిరిసిన దుకాణాలు - live updates of corona virus in andhrapradesh
లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. వాటిని అమలు చేయడంలో వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, రేషన్ డీలర్లు నిర్లక్ష్యం వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి.
రేషన్ కోసం క్యూలైన్లలో వేచిఉన్న ప్రజలు