ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సమరం: జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ - దుగ్గిరాలలో ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన డీఐజీ త్రివిక్రమ వర్మ

గుంటూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, డీఐజీ త్రివిక్రమ వర్మ పోలింగ్​ కేంద్రాల్లో పర్యటించారు. జిల్లాలో పట్టిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహించామన్నారు.

officers visit polling centers
గుంటూరు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ

By

Published : Feb 9, 2021, 4:07 PM IST

గుంటూరు జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసినట్లు వెల్లడించారు.

డీఐజీ త్రివిక్రమ వర్మ దుగ్గిరాలలోని పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. ఎన్నికల సరళిపై అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఐజీ చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా గ్రామాల్లో.. ఇదే తరహా బందోబస్తు ఉంటుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details