ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హరిత'హతం'... పచ్చని మొక్కలపై రంపపుపోటు!

ఓ పక్క పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే అనర్ధాలను చూస్తూనే(వింటూనే) ఉన్నాం. కానీ.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల తీరు సగటు మనిషిని ఆగ్రహానికి గురిచేస్తోంది.

By

Published : Aug 8, 2019, 11:34 PM IST

నగరాల్లో పచ్చదనం దూరమవుతోంది

నగరాల్లో పచ్చదనం దూరమవుతోంది

వేలాది వాహనాలతో పెరుగుతున్న పొగ కాలుష్యాన్ని నియంత్రించటానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ రోజురోజుకు రోడ్లు పెంచే పేరుతో, ట్రిమ్మింగ్​ పేరుతో మెుక్కలను తొలగించేస్తున్నారు. 'పచ్చదనాన్ని పెంచండి, కాలుష్యకారిక ప్రమాదపు వాతావరణాన్ని నివారించండి' అంటూ.. ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. గుంటూరు నగర పాలకసంస్థ చెట్లను కొట్టేస్తోంది. నగరంలోని ప్రధాన రహదార్లలో పెంచిన మొక్కలు ట్రిమ్మింగ్ పేరుతో మోడువారుతున్నాయి. గుంటూరు నగరంలోని అరండల్ పేట-బ్రాడీపేట రహదారి మార్గం బోసిపోయి కనిపిస్తోంది. మొక్కలను ఇలా నరకటంపై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details