గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ మహంకాళి అమ్మవారి 46వ తిరునాళ్ల మహోత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రవేశం అనంతరం విఘ్నేశ్వర పూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు.
ఘనంగా ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్లు - guntur district latest news
గుంటూరు జిల్లా ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎంపీ తెలిపారు. అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆలయ ఛైర్మన్ జల్లి శ్రీనివాసరావు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ నిర్వహకులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. రెండో రోజైన మంగళవారం అమ్మవారికి పొంగళ్లు సమర్పించే కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. మూడో రోజున అమ్మవారికి ప్రభలు ఏర్పాటు చేస్తారని వివరించారు.
ఇదీచదవండి.