అన్నా క్యాంటీన్లను మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో బతుకుతున్నామని గుంటూరులో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం క్యాంటీన్లను ఈ నెలాఖరుతో మూసివేస్తుందని వస్తున్న ఊహాగానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడతాయన్నారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలనూ చెల్లించటంలేదని... వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.
మా పొట్ట కొట్టకండి... అన్నా క్యాంటీన్లను కొనసాగించండి!
తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం మూసివేస్తే.. తమ బతుకులు ప్రశ్నార్థకమవుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నాక్యాంటిన్