ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ వాహనాలు తుప్పు పట్టి... మట్టి పాలై' - Government vehicles are being ignored and damaged

ప్రజాధనంతో... ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలు నిరుపయోగంగా మారాయి. వేల కిలోమీటర్లు తిరిగి మరమ్మతులకు గురైన వాహనాలను పట్టించుకునే వారు లేక కార్యాలయాల ప్రాంగణాల్లో అలంకార ప్రాయంగా మారాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండల ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి ఇది.

government-vehicles-that-are-being-ignored-and-damaged-in-guntur-repalle
'ప్రభుత్వ వాహనాలు... తుప్పు పట్టి మట్టి పాలై'

By

Published : Dec 17, 2019, 7:29 PM IST

'ప్రభుత్వ వాహనాలు... తుప్పు పట్టి మట్టి పాలై'

గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ, తహశీల్దార్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, అగ్నిమాపక కార్యాలయాల ముందు ప్రభుత్వ వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గతంలో అధికారుల వాహనాలు నడిపేందుకు డ్రైవర్లు ఉండేవారు. కాలక్రమేణా డ్రైవర్ల నియామకం లేకపోవడంతో... పాత వాహనాలు వాడేందుకు అధికారులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా ప్రభుత్వ వాహనాలను పట్టించుకునే వారు లేక... తుప్పుపట్టి మట్టి పాలవుతున్నాయి. లక్షలు వెచ్చించి ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలు నిరుపయోగంగా మారటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి అలా పడి ఉండే బదులు వాటిని అమ్మి... ఆ డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు, ప్రజల అవసరాలు వంటి వాటికి ఉపయోగించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details