ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకే 'కేజ్ కల్చర్'

ఆధునిక పద్ధతిలో చేపల పెంపకానికి మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా.. కేజ్ కల్చర్​కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు జిల్లా బాపట్ల తీరప్రాంతంలో 21 మంది లబ్ధిదారులకు కేజ్ కల్చర్ ద్వారా చేపలు పెంచేందుకు మత్స్యశాఖ అవకాశం కల్పించింది.

By

Published : Aug 26, 2019, 9:43 PM IST

government-launch-to-cage-culture-for-fishermans

మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకే 'కేజ్ కల్చర్'

శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి గుంటూరులో కేజీ కల్చర్​ను ప్రారంభించారు. ఆధునిక పద్ధతిలో చేపల పెంపకానికి మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బోట్లు ,వలలు, లబ్ధిదారులకు అందజేశారు.

ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే..ఈ ప్రాంతంలో వెయ్యికి పైగా కేజ్​కల్చర్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టవచ్చని చెబుతున్నారు మత్స్యకారుల సంఘం నేతలు. మన దేశంలో సంవత్సరానికి 40 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు పెంచుతుంటే.. స్పెయిన్ అనే చిన్న దేశం నుండి 60 లక్షల టన్నులకు పైగా చేపల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాలమైన తీరప్రాంతం ఉందని ప్రభుత్వం మత్స్యకారులకు ప్రోత్సాహం అందించాలని జాతీయ మత్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంత నగేష్ కోరారు.

For All Latest Updates

TAGGED:

culture

ABOUT THE AUTHOR

...view details