మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని తుంగలో తొక్కే విధంగా నేటి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీమంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుంటూరు తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు.
న్యాయ వ్యవస్థను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: నక్కా ఆనంద్ బాబు - తెదేపా కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
మహాత్మగాంధీ అహింసా సిద్ధాంతాన్ని తుంగలో తొక్కేలా... ప్రభుత్వం పాలనా సాగిస్తోందని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని... జడ్జి రామకృష్ణ కుటుంబంపై దాడిని నిరసిస్తూ చలో మదనపల్లి కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హింసాత్మక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలన్నారు.
ఇదీ చదవండి: