2020-21 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల పాటు వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 10 నెలల జీతాలు ఇస్తుండగా.. ఈ ప్రక్రియను 12 నెలలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేశారు.
ప్రభుత్వ జూనియర్, వృత్తివిద్య, పాలిటెక్నిక్, డిగ్రీ , ప్రైవేటు ఓరియంటల్ కళాశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 5,042 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు.