ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాపం ఆవులు..! నెలరోజులుగా వరదనీటిలోనే - cows

కృష్ణా నది వరదలధాటికి మనుషులే కాదు,ముూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. నెలరోజులుగా పులిచింతల బ్యాక్ వాటర్ అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్ళిన 50 ఆవులు వరదలో చిక్కుకుపోయాయి. అందులో 20 ఆవులు మేత లభించక మృత్యువాత పడితే, మిగతా 30 ఆవులు బక్కచిక్కి చావుకి దగ్గరగా ఉన్నాయి. ఆవులను వరదనీటి నుంచి బయటకు తెచ్చేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.

మేత కోసం వెళ్లి నెలరోజులుగా వరదలోనే !

By

Published : Sep 26, 2019, 9:38 AM IST

మేత కోసం వెళ్లి నెలరోజులుగా వరదలోనే !

కృష్ణమ్మ వరద ఉద్ధృతితో గుంటూరు జిల్లా పులిచింతల జలాశయం నిండిపోవడంతో,చాలా ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి.కంచుబొడ్డు తండాకు చెందిన50ఆవులు పులిచింతల బ్యాక్ వాటర్ ఉన్న అటవీ ప్రాంతంలో నెలరోజుల క్రితం మేతకు వెళ్లాయి.ఈలోగా వరద ఉద్ధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయాయి.సరైన ఆహారం లేక,అనారోగ్యంతో20వరకు ఆవులు మృత్యువాత పడ్డాయి.మరో30ఆవులు బక్కచిక్కి మృత్యువుతో పోరాడుతున్నాయి.పులిచింతల ప్రాజెక్టులో చేపలు పెట్టేవారు ఆవులను గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు.వాటిని బయటకు తీసుకురావలంటే లాంచీ,పడవల ద్వారా తప్పమరో మార్గం కనిపించక వాటి యాజమానులు ఆందోళన చెందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details