Garbage Collection Vehicles in AP: పట్టణాల్లో.. ఇళ్ల నుంచి చెత్త సేకరణ కోసం వైసీపీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన ఈ-ఆటోలు అనేక చోట్ల పురపాలక కార్యాలయాలకే.. పరిమితం అయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడం, డ్రైవర్లు దొరక్కపోవడం వంటి కారణాలతో.. వీటిని అలంకార ప్రాయంగా మార్చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఆటోలు.. రోడ్లపైకి రాకముందే పాడవుతున్నాయి.
CM Jagan Inauguration of E-Auto: 21కోట్ల 18లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం 2నెలల క్రితం.. 516 ఈ-ఆటోలను కొనుగోలు చేసింది. రాష్ట్ర.. పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి తీసుకున్న రుణంతో ఒక్కో ఆటో 4 లక్షల 10 వేల రూపాయల చొప్పున ఏపీ స్వచ్ఛాంధ్ర సంస్థ కొనుగోలు చేసింది. పట్టణాల్లో.. ఇళ్ల నుంచి చెత్త సేకరణ కోసం కొన్న ఈ-ఆటోలను.. ముఖ్యమంత్రి జగన్ జూన్ 8న జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో చాలా వరకూ జగన్ ప్రచారానికి తప్ప.. అవసరాలకు రోడ్డెక్కలేదు.
స్వచ్ఛత కోసం లక్షలు కేటాయింపు.. నిరుపయోగంగా కొత్త యంత్రాలు...
Garbage Collection Vehicles: కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో రిజిస్ట్రేషన్ పూర్తికాక 5 ఆటోలు పక్కన పడేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు కేటాయించిన.. 9 ఆటోల్లో ఒక్కటీ వినియోగింలోకి తేలేదు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదంటూ నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ పురపాలక సంఘానికి పంపిన ఐదు ఆటోలూ అలంకార ప్రాయంగా మారాయి.
E-Autos For Collection of Garbage in Municipalities: అనంతపురం జిల్లా రాయదుర్గంలో.. 9 ఆటోల్లో ఒక్కటీ రోడ్డు ఎక్కలేదు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు వచ్చిన.. ఆరింటి పరిస్థితీ అంతే. కాకినాడ జిల్లా పెద్దాపురంలో సచివాలయానికి ఒకటి చొప్పున 14 ఆటోలు కేటాయించగా.. అవన్నీ కార్యాలయం వెనుకే పడున్నాయి. తునికి కేటాయించిన 9, పిఠాపురానికి కేటాయించిన 8 ఆటోలు నిరుపయోగంగా ఉన్నాయి.
చెత్త ఎత్తకుండానే చిత్తవుతున్న సేకరణ వాహనాలు..
Refuse Collection Vehicle: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌కి కేటాయించిన 9ఆటోల్లో ఒక్కటీ వినియోగంలోకి.. రాలేదు. తాడేపల్లి నుంచి పురపాలక, నగర పంచాయతీలకు తరలించిన.. 90శాతం ఆటోలు రోడ్డెక్కలేదు. అవన్నీ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పాడవుతున్నాయి. చెత్త సేకరణకు డబ్బు వసూళ్లపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తొలి దశలో 42 పుర, నగరపాలక సంస్థల్లో చెత్త సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది.
Trash Collection Vehicles: ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 వరకూ, దుకాణాలు, భారీ వ్యాపార సంస్థల్లో రూ.25 నుంచి రూ.15 వేల వరకు వినియోగ రుసుములు వసూలు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికలను.. దృష్టిలో పెట్టుకుని వాటిని పక్కపెట్టేశారా అనే అనుమానాలు.. వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాని కారణంగానే ఆటోలు నడపడం లేదని చెబుతున్నారు.
చెత్త సేకరణ బండిపై మృతదేహం తరలింపు.. అధికారులపై వేటు