గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది ఎయిమ్స్‌లో వైద్యులు, నర్సులు, సెక్యూరిటీ సిబ్బందికి.. అగ్నిప్రమాదాల నివారణ గురించి వివరిస్తూ.. మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆసుపత్రిలో ఎటువంటి అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది... అటువంటప్పుడు ఏ విధంగా ఎదుర్కొనాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో అలసత్వంగా వ్యవహరించవద్దనీ.. అలా జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించాలనే అంశాలను ప్రజలను వివరించారు. ముఖ్యంగా ఇంటిలో వంట చేసేటప్పుడు.. గ్యాస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలనీ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మంటలు అంటుకునే ప్రమాదం ఉందన్నారు.