ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులోని ఇండియన్​ పెట్రోల్ బంక్‌లో మంటలు..తప్పిన పెను ప్రమాదం - ఐవోసీ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం

గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా మంటలు చెలరేగినట్లు బంక్ సిబ్బంది తెలిపారు.

Fire acciden in a Petrol Bunk
గుంటూరులోని ఇండియన పెట్రోల్ బంక్‌లో మంటలు

By

Published : Jan 23, 2021, 8:44 PM IST

Updated : Jan 23, 2021, 9:24 PM IST

ఇండియన్​ పెట్రోల్ బంక్‌లో మంటలు

గుంటూరు లాడ్జి సెంటర్​లోని ఇండియన్ పెట్రోల్ బంక్​లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బుల్లెట్ బైకులో పెట్రోల్ నింపుతుండగా ట్యాంక్ నిండిపోయి ఇంజన్ మీద పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైకు సగానికిపైగా మంట్లలో దగ్ధమైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే లాడ్జి సెంటర్​లో అగ్నిప్రమాదం జరగడం వల్ల స్థానికులు కంగారు పడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Jan 23, 2021, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details