ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' సాయంత్రం వరకు ఫెర్టిలైజర్స్ దుకాణాలు తెరిచిఉంచాలి'

గుంటూరు జిల్లాలో కరోనా వల్ల వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయడంతో... రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పరిశీలించిన జిల్లా అధికారులు.. సాయంత్రం వరకు ఫెర్టిలైజర్స్ దుకాణాలు తెరిచిఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.

By

Published : Aug 13, 2020, 8:26 AM IST

fertilizers shops times extended at guntur
దినేష్‌కుమార్‌

గుంటూరు జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయడంతో...రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని పరిశీలించిన జిల్లా అధికారులు సాయంత్రం వరకు ఫెర్టిలైజర్స్ దుకాణాలు తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటి వరకు వ్యాపార సంస్థల క్రయ, విక్రయాల సమయాన్ని ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు అదే విధానాన్ని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలు అనుసరించాయి. కొద్దిసేపు మాత్రమే దుకాణాలు తెరచి ఉండటం వలన.. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో పంటల సాగు వేగవంతమైనందువల్ల రైతులు ఉదయాన్నే దుకాణాల వద్ద గుంపులుగా ఉంటున్నారు. పరిస్థితులను తెలుసుకున్న జిల్లా రైతు భరోసా, రెవెన్యూ సంయుక్త పాలనాధికారి దినేష్‌కుమార్‌ దుకాణాలను సాయంత్రం వరకు తెరిచి ఉంచాలని ఉత్తర్వులు‌ జారీ చేశారు. కొవిడ్‌19 నిబంధనలను దుకాణదారులు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details