ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి - పొన్నూరులో కుమారుడిని చంపిన తండ్రి వార్తలు

మద్యం.. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎందరి ప్రాణాలనో తీస్తోంది. మద్యానికి బానిసై కొంతమంది, ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ప్రాణాలు తీస్తున్నవారు మరికొంతమంది ఉన్నారు. పూటుగా మద్యం సేవించి, మాటా మాటా పెరిగి, కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది.

father killed son in ponnuru guntur district
మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి

By

Published : Aug 27, 2020, 1:41 PM IST

మద్యం మత్తులో తండ్రి.. కుమారుడిని హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కొక్కిలిగడ్డ అశోక్​కు అతని భార్యకు మధ్య వివాదాలు ఉండటంతో ఆమె కొంతకాలం క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో అశోక్, అతని తండ్రి దైవసహాయం ఉంటున్నారు. తండ్రీకొడుకుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించి వాగ్వాదం పెట్టుకున్నారు. మాటా మాటా పెరిగి గొడవ తీవ్రం అయ్యింది. అనంతరం అశోక్ పడుకుని ఉండగా.. అతని తండ్రి దైవసహాయం రోకలిబండతో అతని తలపై కొట్టాడు. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details