..
కృష్ణాయపాలెంలో బస్సులను శుభ్రం చేస్తూ రైతుల వినూత్న నిరసన - అమరావతి రైతుల నిరసన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు బస్సులు తుడిచి...ప్రయాణికులకు గులాబి పూలు అందించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి తామంతా రోడ్డున పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణాయపాలెంలో రైతుల నిరసన