Employees are Opposing GPS Scheme: జీపీఎస్‌లో చర్చనీయాంశంగా మారిన "C' నిబంధన.. 33 ఏళ్ల సర్వీసుకే ఉద్యోగుల పదవీ విరమణ..? Employees are Opposing GPS Scheme:జీపీఎస్ బిల్లులో ఉద్యోగులు పథకం ప్రయోజనాలు పొందాలంటే ఎంత సర్వీసు ఉండాలనే అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. అందులోని నాలుగో భాగం ఒకటో అంశంలోని "C' నిబంధన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులతో ప్రభుత్వం పదవీ విరమణ చేయిస్తే అలాంటి ఉద్యోగులకు కనీసం 33 సంవత్సరాల అర్హత సర్వీసు ఉంటేనే.. ఈ గ్యారంటీ పింఛను పథకం ప్రయోజనాలు అందుతాయని స్పష్టంగా జగన్ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన పింఛను రూల్స్ 1980లో ఉన్న నిబంధన 44 ప్రకారం ఇక్కడ ఈ అంశం చేర్చినా ఇప్పుడు దాని అవసరమేంటన్న ప్రశ్న వస్తోంది.
Teachers Agitations continues on GPS: జీపీఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు.. సాధించే వరకూ పోరాడుతామంటున్న ఉపాధ్యాయ సంఘాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. సర్వీసుతో పదవీ విరమణకు సంబంధం లేదు. ప్రజా ప్రయోజనాలతో ఉద్యోగులను పదవీవిరమణ చేయించడం అన్నది ఇంతవరకు అమల్లో లేనిది. పింఛను రూల్స్‌లో ఎప్పుడో ఉన్న ఈ నిబంధనను జీపీఎస్‌లో చేర్చారు. ఉద్యోగులంతా పాత పింఛను విధానం కావాలని అడిగినా అది ఇవ్వకపోగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టే నిబంధనలు తీసుకొచ్చి జీపీఎస్‌లో పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న పింఛను రూల్ కావచ్చు. కానీ కొన్నేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఇది గుబులు రేపుతోందని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ విషయంలో కొన్ని అంశాలు ప్రచారంలోకి వచ్చాయి.
Jagan Government Passed the GPS Bill: ఉద్యోగులను మళ్లీ దగా చేసిన జగన్ ప్రభుత్వం.. జీపీఎస్‌తో సరికొత్త టెన్షన్
దేశవ్యాప్తంగా ఉద్యోగుల పదవీ విరమణకు వయసు మాత్రమే కాకుండా సర్వీసునూ పరిగణనలోకి తీసుకుంటారన్న చర్చ జరిగింది. కొంత సర్వీసు పూర్తయ్యాక, వారి పనితీరు సరిగా లేకుంటే పదవీ విరమణ చేయించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్న చర్చ సాగింది. ఈ ఏడాది జూన్‌లో లోక్‌సభలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తమకు మార్చే ఆలోచన, కొత్త విధానం తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల రీత్యా ఉద్యోగులను పదవీవిరమణ చేయించడం అన్న నిబంధన ఈ జీపీఎస్ బిల్లులో ఎందుకు ఉపసంహరించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Employees Protest Against Approval of GPS Bill: శాసనసభలో జీపీఎస్ ఆమోదం.. ఇది స్కీమ్ కాదు స్కామ్ అంటూ భగ్గుమన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగుల పదవీ విరమణపై కొంత హడావుడి జరిగింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 30 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయసుగా మార్చబోతున్నారంటూ నాడు కొందరు ప్రతిపక్ష నాయకులు, వారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘ నాయకులు హడావుడి చేశారు. సాధారణ పరిపాలన శాఖ దీనిపై ఫైలు సిద్ధం చేసిందని హల్‌చల్ చేశారు. అప్పట్లో సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి తన శాఖ అధికారులను పదవీ విరమణకు సంబంధించిన కొంత సమాచారం అడిగి వివరాలు పంపాలని నోట్ పెట్టారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాడు జరిగిన ప్రచారం నేపథ్యంలో ఈ వివరాలు కోరారు. అప్పట్లో దీనిపై చర్యలేవీ లేకున్నా.. కేవలం సమాచారం అడిగినందుకే ఆ ఉద్యోగ సంఘ నాయకులు వివాదం సృష్టించారు. ఇప్పుడు జీపీఎస్ బిల్లులో ఈ నిబంధన చేర్చినా ఉద్యోగ సంఘ నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం.