గుంటూరు జిల్లా పెదనందిపాడు వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు ఒక ఆటోలో కిక్కిరిసి, వెనుక వేలాడుతూ రావాల్సి వచ్చింది. కరోనా విజృంభిస్తున్న వేళ... ఇలా మహిళలు గుంపుగా వాహనంలో రావడంపై విమర్శలు తలెత్తాయి. హోంమంత్రి సుచరిత హాజరైన సమావేశానికి వీరంతా వచ్చారు. గుంపులు గుంపులుగా హోంమంత్రి వద్ద నిలుచుని సమస్యలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వమే ఇలా చేస్తే... ప్రజలకు ఎవరు చెప్తారని పలువురంటున్నారు.
కొవిడ్ నిబంధనలు గాలికి...ఆటోలో గుంపులుగా.. - corona in pedanandipadu news
కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. బహిరంగ కార్యక్రమాల కోసం కొవిడ్ జాగ్రత్తలను బేఖాతర్ చేసి..ఆటోలో కిక్కిరిసి పోయారు. సమావేశంలో కూడా భయం లేకుండా భౌతిక దూరాన్ని మరిచారు.
పెదనందిపాడు వైఎస్సార్ ఆసరా కార్యక్రమం