గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని కాటూరి ఆస్పత్రి వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైద్యశాల క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటున్న డాక్టర్ జగన్నాథం మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
డాక్టర్ నివసిస్తున్న క్వార్టర్స్ గది నుంచి ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. డాక్టర్ కుటుంబ సభ్యులు, భార్య కర్నూలులో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.