ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sangam Diary: అమూల్ డెయిరీ కోసం... మన రాష్ట్ర డెయిరీలను అభివృద్ది చేయడం లేదు: ధూళిపాళ్ల నరేంద్ర

Dhulipalla Narendra comments: అమూల్‌తో పోటీ పడటానికి తమకేం భయంలేదని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ అన్నారు. ప్రభుత్వం అప్పుతీసుకొచ్చి మరీ 3000కోట్ల రూపాయలు అమూల్‌పై పెట్టుబడులు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని నరేంద్ర స్పష్టం చేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమూల్‌ను వ్యతిరేకిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 5, 2023, 7:36 PM IST

అమూల్‌తో పోటీపడటానికి తమకేం భయంలేదన్న ధూళిపాళ్ల

Dhulipalla Narendra comments on Amul Dairy: ప్రభుత్వం అమూల్ సంస్థకు నిధులు తెచ్చిపెట్టడం మానుకొని రాష్ట్ర డెయిరీలు అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీలో రెండు కోట్ల రూపాయలతో రిఫ్రిజిరేషన్ ప్లాంట్, పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలో భాగంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ... ప్రభుత్వ సహకారం లేకపోయినా డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో అమూల్ డెయిరీని వద్దని అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారని... ఆంధ్రప్రదేశ్​లో సైతం అమూల్ డెయిరీకి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సంగం డెయిరీ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అమూల్ సంస్థ కోసం ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అమూల్ కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై నిరసన తెలియ చేస్తున్నట్లు ధూళిపాళ్ల వెల్లడించారు.

అమూల్ కోసం ప్రభుత్వ సొమ్ము వాడొద్దు: హైకోర్టు

సంస్థకు రాష్ట్ర సొమ్మును దోచిపెడుతున్నారు: మన రాష్ట్రంలో డెయిరీలను అభివృద్ధి చేయకుండా... రాష్ట్ర ప్రభుత్వం అమూల్ లాంటి సంస్థలకు కొమ్ముకాయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ డెయిరీ వ్యవస్థాపకుడు కురియన్ దేశ వ్యాప్తంగా అమూల్ లాంటి సంస్థలు ఏర్పడాలని కోరుకున్నారని వెల్లడించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమూల్ సంస్థకు రాష్ట్ర సొమ్మును దోచిపెడుతోందని వెల్లడించారు. అమూల్ కోసం ఖర్చుపెట్టే సొమ్ము మన రాష్ట్ర సంస్థల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఇక్కడ డెయిరీలు బాగుపడతాయని ధూళిపాళ్ల నరెేంద్ర హితవు పలికారు. ప్రజల సొమ్మును అమూల్ కోసం ముఖ్యమంత్రి ధారాదత్తం చేస్తున్నారని నరేంద్ర మండిపడ్డారు.

అమూల్‌ పాల సేకరణకు రూ.1,267 కోట్లతో బీఎంసీయూల నిర్మాణం

నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు:మూల్ సంస్థ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇక్కడ వ్యాపారం చేస్తుందని ధూళిపాళ్ల ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాడి రైతులకు లీటర్​కు నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి నాలుగేళ్లు అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డెయిరీలను ఈ ప్రభుత్వం అమూల్ కోసం కేటాయించడం దారుణం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న డెయిరీలకు ప్రభుత్వం ఇదే విధంగా నిధులు కేటాయిస్తే... ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ నిధులు తిరిగి వస్తాయని ధూళిపాళ్ల వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అప్పుచేసి అమూల్ సంస్థకు తగిలేస్తోందని ఆరోపించారు. మన రాష్ట్రంలో డెయిరీ సంస్థలను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రజలు ఈ అంశంపై కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో తిరగపడినట్లుగా... తిరగబడాలని ధూళిపాళ్ల పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details