పంచాయతీ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కరోనా టీకాలు తీసుకుంటున్నారు. మంగళగిరి డీజీపి కార్యాలయంలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీజీపి గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో టీకాల ప్రక్రియను ప్రారంభించారు. డీజీపి కార్యాలయంలో సుమారు 400కి పైగా సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ వేయనున్నట్లు డీజీపి తెలిపారు. కోవిడ్‌ను అరికట్టాలంటే టీకా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని.. వ్యాక్సినేషన్ సురక్షితమన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో...ఎన్నికలలోపే వ్యాక్సినేషన్‌ను తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కరోనా టీకాలు
మంగళగిరి డీజీపి కార్యాలయంలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీజీపి గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కరోనా టీకాలు