అమరావతి ఉద్యమం నేపథ్యంలో రైతులు, మహిళలపై పెడుతున్న పోలీసుల కేసులపై ఆందోళన చెందవద్దని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఒక్క జీవోతో అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో తెలియదని వ్యాఖ్యానించారు. అమరావతి ఎక్కడి పోదని.. మహిళలు, రైతులు పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని కోరారు. తుళ్లూరులోని మహాధర్నా శిబిరానికి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి వచ్చిన దేవినేని.. రైతులు, మహిళల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అమరావతి ఉద్యమానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు అండగా ఉన్నాయని చెప్పారు.
వైకాపా ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో తెలియదు: దేవినేని - అమరావతి రైతుల ఉద్యమం న్యూస్
రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు పెడుతున్న కేసుల గురించి ఆందోళన పడవద్దని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మహిళలు, రైతులు పోరాటాన్ని ఉద్ధృతం చేయాలన్నారు.
వైకాపా ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో తెలియదు:దేవినేని