ETV Bharat / city

నిరసన వీడని అమరావతి... భోగి మంటల్లో కమిటీ ప్రతులు

author img

By

Published : Jan 14, 2020, 9:30 AM IST

Updated : Jan 14, 2020, 10:23 AM IST

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులు పండుగ రోజునా ఉద్యమ బాట వీడలేదు. మూడు రాజధానులు చేయాలని సూచించిన కమిటీ ప్రతులు దహనం చేసి తమ నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

amaravathi-protest-news-in-ap-on-bhogi
amaravathi-protest-news-in-ap-on-bhogi

కృష్ణాజిల్లా గుడివాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జీఎన్‌రావు, బోస్టన్‌ నివేదికలు దహనం చేయడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ గుడివాడ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి నాయకులను అరెస్టు చేశారు. శాంతి యుతంగా చేస్తున్నామని నిరసన అడ్డుకోవడంపై ఐకాస నేతలు పోలీసులపై మండిపడ్డారు.

కృష్ణా జిల్లా గుడివాడ

సంక్రాంతి సాక్షిగా అమరావతి ఆందోళనలు మిన్నంటాయి. ఆడుతూ పాడుతూ చేయాల్సిన భోగిమంటల కార్యక్రమాన్ని నిరసనలతో నిర్వహించాల్సి వచ్చింది. గుంటూరు నగరంలో అమరావతి రాజకీయ ఐకాస, యువజన విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో భోగమంటల ఆందోళనలు నిర్వహించారు. జీఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటి నివేదికల్ని మంటల్లో వేసి నిరసన తెలిపారు. బోగస్ కమిటిలు వేసి... నివేదిక రాకముందే ముఖ్యమంత్రి తన మనసులోని మాట లీక్ చేయటం దారుణమన్నారు.

గుంటూరు

గుంటూరులోని ఎన్డీఆర్ స్టేడియంలో జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలు నిర్వహించగా... కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంబరాలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉదయం నడక కోసం వచ్చిన వారు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ వాకర్స్ అసోషియేషన్ ప్రతినిధులు నినదించారు.

గుంటూరు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు భోగి మంటలు నిర్వహించారు. భోగి మంటల్లో జీఎన్ రావు, బీసీజీ కమిటీ ప్రతులు దహనం చేశారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు.

గుంటూరు

రాజధాని మార్పుపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలో అన్ని పార్టీల ప్రతినిధులను ఎందుకు భాగస్వామ్యం చేయలేదని మాజీ ఎమ్యెల్యే, చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరిజిల్లాలో పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఆయన నివాసంలో భోగిమంటల్లో జీఎన్ రావ్, బోస్టన్ కమిటీ నివేదికల పత్రాలు వేసి.. నిరసన తెలిపారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులు, అనుచరులతో ఆయన భోగి పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కమిటీ పత్రాలను భోగిమంటల్లోకి వేశారు.

గుంటూరు

మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ కనిగిరి లో నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులు. బోగి పండగ సందర్భంగా ఐకాస ఆధ్వర్యంలో బోగి మంటవద్ద ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. జీఎన్‌రావు, బోస్టన్‌ కమిటీ నివేదికల ప్రతులు తగులుబెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, ప్రజ సంఘాల సభ్యులు హాజరై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో.. అంబరాన్నంటిన భోగి సంబరాలు

sample description
Last Updated : Jan 14, 2020, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.